DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... బీటెక్, డిప్లొమా అర్హత... నవంబర్ 20 లాస్ట్ డేట్


DRDO Recruitment 2019 | దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. దరఖాస్తుకు నవంబర్ 20 చివరి తేదీ.

బీటెక్, డిప్లొమా పాసైనవారికి శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 116 అప్రెంటీస్ ఖాళీలను ప్రకటించింది. చండీపూర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన ప్రముఖ ల్యాబరేటరీ అయిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌-ITR కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్ అసెస్‌మెంట్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్ https://rac.gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకోరు. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. దరఖాస్తుకు నవంబర్ 20 చివరి తేదీ. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి డీఆర్‌డీఓ జారీ చేసి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


DRDO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 116

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 60
టెక్నీషియన్ అప్రెంటీస్- 56
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 నవంబర్ 1

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 20 సాయంత్రం 5:30 గంటలు

విద్యార్హత: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా బీఈ, లైబ్రరీ సైన్స్‌లో బీఎస్సీ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పాస్ కావాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలకు ఎక్కువ పోస్టులున్నాయి.



Comments

Popular posts from this blog

Navy Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు