SSC MTS పరీక్షలో అదనంగా 9,551 మంది అర్హత


MTS Recruitment 2019 | 'టైర్-1' పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకే టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) పరీక్ష నిర్వహిస్తారు. దీనిద్వారా 7 వేలకు పైగా మ‌ల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

SSC MTS పరీక్షలో అదనంగా 9,551 మంది అర్హత

హైలైట్స్

· 1.2 లక్షలకు చేరిన పేపర్-2 పరీక్ష అర్హులు

· నవంబరు 24న పేపర్-2 డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహణ

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్-1(టైర్-1) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి పేపర్-2(టైర్-2) పరీక్షకు అదనంగా 9,551 మందిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంపిక చేసింది. అదనంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

· అదనంగా అర్హత సాధించిన అభ్యర్థుల కటాఫ్ మార్కుల వివరాలు..

· అర్హత సాధించిన 9551 అభ్యర్థుల జాబితా..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 5న మల్టీటాస్కింగ్ స్టాఫ్ పేపర్-1 పరీక్ష ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,11,162 మంది అభ్యర్థులు పేపర్-2 (డిస్క్రిప్టివ్) పరీక్షకు ఎంపికయ్యారు. అయితే అప్పుడు ఎక్స్-సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోలేదు. అయితే తాజాగా వారిని పరిగణనలోకి తీసుకోగా.. అదనంగా 9551 పేపర్-2కు అర్హత సాధించారు. దీంతో పేపర్-2కు అర్హత సాధించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 1,20,713కి చేరింది. షెడ్యూలు ప్రకారం నవంబరు 24న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఫలితాలు..

· List-1: List of qualified candidates - Central Region (18-25 years)

· List-2: List of qualified candidates - Northern Region (18-25 years)

· List-3: List of qualified candidates - All Regions other than Central and Northern Regions (18-25 years)

· List-4: List of Qualified candidates (18-27 years)

· కటాఫ్ మార్కులు, ఇతర వివరాలు..ఫైనల్ 'కీ' కోసం క్లిక్ చేయండి..

పేపర్-1 నార్మలైడ్జ్ మార్కుల ఆధారంగా పేపర్-2కు అభ్యర్థులను ఎంపికచేశారు. పేపర్-1 లో అర్హత సాధించిన వారిలో 1 : 15 నిష్పత్తిలో పేపర్-2కు అభ్యర్థులను ఎంపికచేశారు. నార్మలైడ్జ్ మార్కులను జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30%, ఓబీసీ అభ్యర్థులకు 25%, ఇతరులకు 20% గా నిర్ణయించారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 2 నుంచి 22 వరకు మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) టైర్-1 పరీక్ష నిర్వహించింది. దేశవ్యాప్తంగా 146 నగరాల్లోని 337 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో మల్టీటాస్కింగ్‌స్టాఫ్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పేపర్-2 (టైర్-2) పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారంపాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం నవంబరు 17న జరగాల్సిన పేపర్-2 పరీక్షను నవంబరు 24న నిర్వహించనున్నారు. 'టైర్-1' పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకే టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) పరీక్ష నిర్వహిస్తారు.

పేపర్-2 పరీక్ష ఇలా . .
➥ పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న భాష‌లో వ్యాసరూప (డిస్క్రిప్టివ్) పరీక్ష రాయాల్సి ఉంటుంది.
➥ షార్ట్ ఎస్సే/ఇంగ్లిష్ లెటర్ రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 30 నిమిషాలు.
➥ పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులే పేపర్-2 పరీక్ష రాయడానికి అర్హులు.
➥ నవంబరు 24న టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు.

మొత్తం 7,099 పోస్టులు .
మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొత్తం 7099 ఖాళీలు ఉన్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 5,415 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 1,684 పోస్టులు ఉన్నాయి.


Courtesy The times of india..


Comments

Popular posts from this blog

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... బీటెక్, డిప్లొమా అర్హత... నవంబర్ 20 లాస్ట్ డేట్

Navy Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు