BARC Jobs: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఖాళీలు
BARC Vacancies 2019: ముంబైలోని బాబా ఆటోమొబైల్ రీసెర్చ్ సెంటర్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్ నియామకానికి నోటిఫికేషన్. దీని గురించి పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
BARC Jobs: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఖాళీలు
హైలైట్స్
· ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
· దరఖాస్తుకు డిసెంబరు 6 వరకు అవకాశం
ముంబయిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ వివిధ ఖాళీల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
వివరాలు . .
* ఖాళీల సంఖ్య: 92
1) అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రూప్-బి నాన్-గెజిటెడ్): 19 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఎస్సీ-08, ఎస్టీ-02, ఓబీసీ-03, జనరల్-05, ఈడబ్ల్యూఎస్-01.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషులు-167 సెం.మీ ఎత్తు, మహిళలు-157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుషులకు ఛాతీ కనీసం 80 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగింపు సమయానికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 32 సంవత్సరాలు, ఓబీసీలకు 30 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
పేస్కేల్: లెవల్-6 పే మ్యాట్రిక్స్ కింద నెలకు రూ.35,400తో పాటు ఇతర అలవెన్సులు ఇస్తారు.
2) సెక్యూరిటీ గార్డ్: 73 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఎస్సీ-15, ఎస్టీ-6, ఓబీసీ-20, జనరల్-26, ఈడబ్ల్యూఎస్-6.
అర్హతలు: పదోతరగతి.
శారీరక ప్రమాణాలు: మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుషులు కనీసం 167 సెం.మీ. ఎత్తుతోపాటు కనీసం 80 సె.మీ ఛాతీ ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగింపు సమయానికి 18- 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 32 సంవత్సరాలు, ఓబీసీలకు 30 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
పేస్కేల్: లెవల్-1 పే మ్యాట్రిక్స్ కింద నెలకు రూ.18,000 ఇస్తారు. ఇతర అలవెన్సులు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు రూ.150, సెక్యూరిటీ గార్డు పోస్టులకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్ ద్వారా.
రాతపరీక్ష విధానం . .
➦ మొత్తం 75 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
➦ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు కాంప్రహెన్షన్-25 మార్కులు, రిపోర్ట్ రైటింగ్-25 మార్కులు, అనలిటికల్ (మ్యాథ్స్, జనరల్
అవేర్‌నెస్)-25 ప్రశ్నలు అడుగుతారు.
➦ సెక్యూరిటీ గార్డు పోస్టులకు కాంప్రహెన్షన్-25 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్-25 ప్రశ్నలు, అనలిటికల్/బేసిక్ మ్యాథ్స్-25 ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు . .
➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.11.2019.
➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.12.2019.
Comments
Post a Comment