BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు

BECIL Recruitment 2019 | అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు 8వ తరగతి పాసైతే చాలు. స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు ఎలక్ట్రికల్ లేదా వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. స్కిల్డ్, అన్‌స్కిల్డ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 3895 ఖాళీలను ప్రకటించింది. మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్-MVVNL కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కాంట్రాక్ట్ పోస్టులివి. దరఖాస్తు ప్రక్రియ 2019 నవంబర్ 8న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 18 చివరి తేదీ. అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు 8వ తరగతి పాసైతే చాలు. స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు ఎలక్ట్రికల్ లేదా వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. కనీసం 1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉండాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.beciljobs.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
BECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 3895
అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్- 2493
స్కిల్డ్ మ్యాన్‌పవర్- 1402దరఖాస్తు
ప్రారంభం- 2019 నవంబర్ 8 దరఖాస్తుకు
చివరి తేదీ- 2019 నవంబర్ 18
డాక్యుమెంట్ వెరిఫికేషన్- 2019 నవంబర్ 18 నుంచి నవంబర్ 22
విద్యార్హత- స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టుకు ఐటీఐ ఎలక్ట్రికల్ లేదా డిప్లొమా.
అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు 8వ తరగతి.అనుభవం- స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టుకు ఎలక్ట్రికల్స్‌లో 2 ఏళ్లు, అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టుకు ఏడాది.
వేతనం- స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు రూ.Rs. 9,381.06,
అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు రూ.7,613.42.
వయస్సు- 40 ఏళ్ల లోపుఫీజు.
రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.250.
Courtesy News18
Comments
Post a Comment