CPCL Jobs: చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు

CPCL Notification | చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌ వివిధ ఉద్యోగాల భర్తీకి సరైన అర్హతలు ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. పోస్టుల వివరాలు, అర్హతలు ఇలా ఉన్నాయి...

CPCL Jobs: చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు

హైలైట్స్

· నవంబరు 13 నుంచి డిసెంబరు 3 వరకు కొనసాగనున్న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ

· రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక

ఇండియ‌న్ ఆయిల్ ఆధ్వర్యంలోని చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (సీపీసీఎల్‌) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భ‌ర్తీకి నియామక ప్రకటన విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.


వివ‌రాలు..

* ఖాళీల సంఖ్య: 55

పోస్టులుఖాళీలు
జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ప్రొడక్షన్) -1414
జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (ప్రొడక్షన్) - 808
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ - 0101
జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (మెకానికల్) - 0303
జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (మెకానికల్) - 0101
జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) - 0303
జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 0303
జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 0101
జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (P&U–మెకానికల్)- 0101
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఫైర్ & సేఫ్టీ)- 0909
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ (ఫైర్ & సేఫ్టీ)- 0404
జూనియర్ మెటీరియల్స్ అసిస్టెంట్ (పర్చేజ్ & స్టోర్)-0101
జూనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్ (మార్కెటింగ్)-0303
జూనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్ ట్రైనీ (మార్కెటింగ్)-0101
జూనియ‌ర్ అకౌంట్స్ అసిస్టెంట్‌ ట్రైనీ-0101
జూనియ‌ర్ న‌ర్సింగ్ అసిస్టెంట్-0101
మొత్తం పోస్టులు55

అర్హత‌: పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బ్యాచిల‌ర్స్ డిగ్రీ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత‌, అనుభ‌వం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

వయోపరిమితి: 01.11.2019 నాటికి కొన్నపోస్టులకు 26 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకు 30 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ అండ్‌ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా.

రాతపరీక్ష విధానం..

➦ మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.

➦ వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు, అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 70 ప్రశ్నలు అడుగుతారు.

➦ పరీక్ష సమయం 2 గంటలు.

➦ చెన్నైలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు.. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం13.11.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది03.12.2019
ఫీజు చెల్లించడానికి చివరితేది03.12.2019
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్16.12.2019
రాతపరీక్ష తేది29.12.2019
Courtesy The times of india 

Comments

Popular posts from this blog

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... బీటెక్, డిప్లొమా అర్హత... నవంబర్ 20 లాస్ట్ డేట్

Navy Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు