HPCL Jobs: హెచ్‌పీసీఎల్‌ విశాఖపట్నం రిఫైనరీలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి

Recruitment 2019 | కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.



గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. విశాఖపట్నంలోని రిఫైనరీలో ఆపరేషన్స్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 72 ఖాళీలున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది హెచ్‌పీసీఎల్. ఇవాళ హెచ్‌పీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. www.hindustanpetroleum.com వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో ఈ నోటిఫికేషన్ చూడొచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆ వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2019 డిసెంబర్ 21 చివరి తేదీ.


HPCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...

మొత్తం ఖాళీలు- 72

ఆపరేషన్స్ టెక్నీషియన్- 66

బాయిలర్ టెక్నీషియన్- 6
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 22

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 21

విద్యార్హత- సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ.
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు.



Comments

Popular posts from this blog

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... బీటెక్, డిప్లొమా అర్హత... నవంబర్ 20 లాస్ట్ డేట్

Navy Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు