ISRO Jobs: నెల్లూరులోని ఇస్రో కేంద్రంలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
ISRO SDSC SHAR Recruitment 2019 | టెక్నీషియన్ బీ పోస్టుకు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య వేతనం ఉంటుంది. రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.47,000 వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా
విడుదలయ్యాయి.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. టెక్నీషియన్ బీ, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. మొత్తం 92 ఖాళీలున్నాయి. శ్రీహరికోటలోని షార్ కేంద్రంతో పాటు ఇతర సెంటర్లలో వీరిని నియమిస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. టెక్నీషియన్ బీ పోస్టుకు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య వేతనం ఉంటుంది. రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.47,000 వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. టెక్నీషియన్ బీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రీసెర్చ్ అసోసియేట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ISRO SDSC SHAR Recruitment 2019: ఖాళీల వివరాలివే...
Comments
Post a Comment