Job Notifications: రైల్వేతో పాటు పలు సంస్థల్లో 13,000 పైగా పోస్టులు... ఆ కోర్సు చేసినవారికి మాత్రమే

రైల్వేతో పాటు ఆర్డినెన్స్, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లాంటి సంస్థలు వేలాది పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి.

తగిన అర్హతలు ఉండాలే కానీ... అవకాశాలు వస్తూనే ఉంటాయి. ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారికి అవకాశాలకు కొదవే లేదు. ఐటీఐ పాసైనవారికి ప్రతిష్టాత్మక సంస్థల్లో అప్రెంటీస్‌తో పాటు ఉద్యోగావకాశాలు లభిస్తుంటాయి. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్ లాంటి ట్రేడ్స్‌లో ఐటీఐ చదివినవారికి నిత్యం అప్రెంటీస్ అవకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు దేశంలో రైల్వేతో పాటు ఆర్డినెన్స్, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లాంటి సంస్థలు ఐటీఐ పాసైనవారి నుంచి వేలాది పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి.

భారత రక్షణ శాఖకు చెందిన సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఏకంగా 4,805 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అందులో నాన్-ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు- 1595, ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు- 3210. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశముంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL ఇటీవల 3025 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. అందులో జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 2500 ఉన్నాయి. ఐటీఐ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సబ్మిట్ చేయడానికి 2019 నవంబర్ 10 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైల్వేలో ఉద్యోగం కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. మొత్తం 2029 పోస్టుల భర్తీకి వాయువ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. పలు ట్రేడ్స్‌లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 8 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న పైప్‌లైన్స్, రిఫైనరీస్ డివిజన్లల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 1909 ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. దరఖాస్తుకు నవంబర్ 9 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-CSL మొత్తం 671 ఖాళీలను ప్రకటించింది. వర్క్‌మ్యాన్ కాంట్రాక్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. ఐటీఐలో వచ్చిన మార్క్స్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ప్రొడక్షన్ యూనిడ్ డీజిల్ లోకోమోటీవ్ వర్క్స్‌-DLW మొత్తం 374 ఖాళీలను భర్తీ చేయనుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు 2019 నవంబర్ 21 చివరి తేదీ. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్-SAIL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 296 ఖాళీలను ప్రకటించింది. ఆన్‌లైన్ దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్ పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 275 ఖాళీలను ప్రకటించింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. డిసెంబర్ 5 లోగా దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయ రైల్వేకు చెందిన మరో సంస్థ రైల్ వీల్ ఫ్యాక్టరీ-RWF ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఫిట్టర్, మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే వీల్ ఫ్యాక్టరీ. మొత్తం 192 ఖాళీలను ప్రకటించింది. చివరి తేదీ నవంబర్ 15. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-CCL సంస్థ మరో 75 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్‌లో జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సీసీఎల్. దరఖాస్తుకు నవంబర్ 10 చివరి తేదీ. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కడప జిల్లా తుమ్మలపల్లెలోని యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-UCIL వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ లాంటి వారిని నియమించుకోనుంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 9 చివరి తేదీ. మరిన్ని డీటెయిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సెంట్రల్ రైల్వే కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లెవెల్ 1, లెవెల్ 2 పోస్టుల్ని భర్తీ చేస్తోంది స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులివి. దరఖాస్తుకు 2019 నవంబర్ 19 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Courtsey News18

Comments

Popular posts from this blog

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... బీటెక్, డిప్లొమా అర్హత... నవంబర్ 20 లాస్ట్ డేట్

Navy Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు