Jobs: విశాఖలోని నావల్ డాక్‌యార్డ్‌లో 275 జాబ్స్... పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి
Vishakhapatnam Naval Dockyard School Apprentice | మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్ పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
తగిన అర్హతలు ఉండి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్ 275 ఖాళీలను ప్రకటించింది.
తగిన అర్హతలు ఉండి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్ 275 ఖాళీలను ప్రకటించింది.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి డిసెంబర్ 5. ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి డిసెంబర్ 12 చివరి తేదీ.
ఆసక్తిగల అభ్యర్థులు www.apprenticeship.gov.in వెస్‌సైట్‌లో డిసెంబర్ 5 లోగా దరఖాస్తు చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జతపర్చి విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌కు డిసెంబర్ 12 లోగా పంపాలి.
మొత్తం 275 ఖాళీలు ఉండగా ఎలక్ట్రీషియన్- 29, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 32, ఫిట్టర్- 29, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 15, మెషినిస్ట్- 19, పెయింటర్ (జనరల్)- 15, ఆర్ & ఏసీ మెకానిక్- 19, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)- 23, కార్పెంటర్- 23, ఫౌండ్రీమ్యాన్- 7, మెకానిక్ (డీజిల్)- 14, షీట్ మెటల్ వర్కర్- 29, పైప్ ఫిట్టర్- 21 పోస్టులున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతి 50% మార్కులతో పాస్ కావాలి. ఐటీఐ 65% మార్కులతో పాస్ కావాలి.
ఈ పోస్టులకు 2020 జనవరి 29న రాతపరీక్ష జరగనుంది. 2020 జనవరి 31 ఫలితాలు విడుదల కానున్నాయి.
ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 3, పెయింటర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 4, ఫిట్టర్, ఆర్ & ఏసీ మెకానిక్, మెకానిక్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 5, మెషినిస్ట్, ఫౌండ్రీమ్యాన్, పైప్ ఫిట్టర్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 6న ఇంటర్వ్యూ జరగనుంది.
ఎంపికైనవారికి 2020 ఏప్రిల్ 1న శిక్షణ ప్రారంభం కానుంది. శిక్షణా కాలం 1 ఏడాది.
Courtesy News18..
Comments
Post a Comment