Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6,83,823 ఖాళీలు... త్వరలో 1,05,338 పోస్టుల భర్తీ


Central government Jobs | డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇప్పటికే 19,522 ఖాళీలకు పరీక్షల్ని నిర్వహించింది. వాటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో భర్తీ చేయనుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్‌బీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ మరో 4,08,591 ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త. 2019-2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 1,05,338 పోస్టుల్ని భర్తీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య ఎంతో తెలుసా? సుమారు ఏడు లక్షలు. 2018 మార్చి 1 నాటికి 6,83,823 ఖాళీ పోస్టులు ఉన్నట్టు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు రాతపూర్వకంగా వెల్లడించారు. మొత్తం 6,83,823 ఖాళీల్లో గ్రూప్‌ సీ పోస్టులు 5,74,289, గ్రూప్‌ బీ పోస్టులు 89,638, గ్రూప్ ఏ పోస్టులు 19,896 ఉన్నట్టు మంత్రి చెప్పారు. ఆయా శాఖలు వెల్లడించిన ఖాళీల ప్రకారం 2019-2020 సంవత్సరంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మొత్తం 1,05,338 పోస్టుల్ని భర్తీ చేయనుందని ఆయన చెప్పారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్స్ ద్వారా భారతీయ రైల్వే, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2017-18 సంవత్సరంలో 1,27,573 గ్రూప్ సీ, లెవెల్-1 పోస్టుల్ని నోటిఫై చేసిందని, మరో రెండేళ్లలో ఈ ఖాళీల సంఖ్య పెరగొచ్చని మంత్రి వెల్లడించారు. 2018-19 సంవత్సరంలో మరో ఐదు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ల ద్వారా 1,56,138 గ్రూప్ సీ, లెవెల్-1 పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇప్పటికే 19,522 ఖాళీలకు పరీక్షల్ని నిర్వహించింది. వాటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో భర్తీ చేయనుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్‌బీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ మరో 4,08,591 ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. నియామక ప్రక్రియ వేగవంతం చేసేందుకు కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తున్నాయని రిక్రూట్‌మెంట్ సంస్థలు. దాంతో పాటు నాన్-గెజిటెడ్ పోస్టులకు 2016 జనవరి 1 నుంచి ఇంటర్వ్యూలను తొలగించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు బ్లాక్‌లాగ్ ఖాళీలు రిజర్వ్ చేసి ఉన్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు మంత్రి. 2019 జనవరి 1 నాటికి ఎస్సీలకు 1,713, ఎస్టీలకు 2,530, ఓబీసీలకు 1,773 బ్యాక్‌లాగ్ ఖాళీలున్నాయి.


Comments

Popular posts from this blog

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... బీటెక్, డిప్లొమా అర్హత... నవంబర్ 20 లాస్ట్ డేట్

Navy Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు