Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు
CCRAS
Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
దరఖాస్తుకు 2019 డిసెంబర్ 19 చివరి
తేదీ. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పుడు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ క్లర్క్ పోస్టుల్ని ప్రకటించింది. పలు డివిజన్లలో క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 66 ఖాళీలున్నాయి. ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ccras.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 19 చివరి తేదీ. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.
CCRAS Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 66
అప్పర్ డివిజన్ క్లర్క్- 14
లోయర్ డివిజన్ క్లర్క్- 52
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 19 సాయంత్రం 5.30 గంటలు
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు
విద్యార్హత- అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు ఇంటర్ పాస్ కావాలి. నిమిషానికి ఇంగ్లీష్‌లో 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
Comments
Post a Comment