RRB JE హాల్‌టికెట్లు వచ్చేశాయి.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

RRB JE Recruitment 2019 | 


స్టేజ్-1 పరీక్షలో అర్హత సాధించినవారికి స్టేజ్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా వివిధ రైల్వేజోన్లలో ఖాళీగా ఉన్న 13,487 పోస్టుల జూనియర్ అసిస్టెంట్, ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు.

RRB JE హాల్‌టికెట్లు వచ్చేశాయి.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

హైలైట్స్

· వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ హాల్‌టికెట్లు

· స్టేజ్-2 స్కోరు కార్డు కూడా అందుబాటులో

రైల్వేల్లో జూనియర్ ఇంజినీర్(JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్(DMS), కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్(CMA) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్లను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. స్టేజ్-2 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లతోపాటు.. స్టేజ్-2 పరీక్ష స్కోరు కార్డును కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

· హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

· స్టేజ్-2 స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి..

షెడ్యూలు ప్రకారం ఆర్‌ఆర్‌బీ జేఈ 'స్టేజ్-2' పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబరు 18 నుంచి 29 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 1.30 గంటలకు రెండో సెషన్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

సికింద్రాబాద్ రీజియన్‌లో మొత్తం 1234 మంది అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు డిసెంబరు 2న మరోసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి షెడ్యూలు ఇలా..


రైల్వేలో మొత్తం 13,487 జేఈ, ఇతర పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు మే 22 నుంచి స్టేజ్-1 పరీక్షలను నిర్వహించింది. స్టేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 1 వరకు స్టేజ్-2 పరీక్ష నిర్వహించింది. స్టేజ్-2 ఫలితాలను తాజాగా వెల్లడించింది. స్టేజ్-2 పరీక్షలో అర్హత సాధించిన వారికి తదుపరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేయనున్నారు.

Courtesy The times of india..

Comments

Popular posts from this blog

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... బీటెక్, డిప్లొమా అర్హత... నవంబర్ 20 లాస్ట్ డేట్

Navy Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు